హుస్నాబాద్‌లో ఏఐవైఎఫ్ రాస్తారోకో - result
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చౌరస్తాలో అఖిలభారతీయ యువజన సమైక్య (ఏఐవైఎఫ్ ) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఇంటర్ ఫలితాల వివాదంపై అఖిలభారతీయ యువజన సమాఖ్యా (ఏఐవైఎఫ్ ) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఏర్పడ్డ అవకతవకల వల్ల 20 మంది విద్యార్థులు చనిపోయారని గుర్తు చేశారు. వెంటనే బోర్డు కార్యదర్శి అశోక్ బాబును సస్పెండ్ చేయాలని.. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.