తెలంగాణ

telangana

ETV Bharat / state

4ఏళ్లక్రితం కొడుకు, నేడు తండ్రి విద్యుదాఘాతంతో మృతి - రైతు మృతి

సిద్దిపేట జిల్లాలో ఓ రైతు పొలంలో విద్యుదాఘాతం​తో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలిచారు.

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి

By

Published : Aug 12, 2019, 1:18 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామంలో బూరు ఎర్రోళ్ల నాగయ్య (52) అనే రైతు తన పొలంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం మృతుడి కొడుకు కూడా విద్యుదాఘాతంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం రైతు కుటుంబానికి అప్పగించారు.

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details