సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నూతన విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు.
వ్యవసాయ బిల్లు రద్దు చేయాలి: చాడ వెంకట్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆ పార్టీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వ్యవసాయ బిల్లు రద్దు చేయాలి: చాడ వెంకట్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి వెంటనే మద్దతు ధర ప్రకటించాలని కోరారు. సన్న వరి పండించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబితే రైతులు ఆ పంట వేశారని చెప్పారు. ఇప్పుడు ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతారని తెలిపారు.