హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలో భిక్షాటన చేశారు. ప్రధాన వీధుల్లో ఫ్లాకార్డులతో నిరసన తెలుపుతూ వివిధ దుకాణాలు, వాహనదారుల వద్ద భిక్షాటన చేపట్టారు. గత 14 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించలేదని పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అన్నారు.
హుస్నాబాద్‌లో భిక్షాటన చేసిన కాంగ్రెస్ నాయకులు - husnabad latest news
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలో భిక్షాటన చేశారు. గత 14 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్థానిక ఎమ్మెల్యే స్పందించలేదన్నారు.
హుస్నాబాద్‌లో భిక్షాటన చేసిన కాంగ్రెస్ నాయకులు
ఎమ్మెల్యేకు ఆరోగ్యం బాగా లేదనే ఉద్దేశంతో శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నామని చెప్పారు. అంబులెన్స్ కోసం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ బాధ్యులు బొమ్మం శ్రీరాం 50 వేల చొప్పున విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!