ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కరవైందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో రైతు వేదిక నిర్మాణం కోసం తన భూముని లాక్కున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింలు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం చేశారు.
రైతు నర్సింలు కుటుంబానికి వీహెచ్ ఆర్థిక సహాయం
తన భూముని లాక్కున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింలు కుటుంబాన్ని కాంగ్రెస్ నేత వీహెచ్ పరామర్శించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి వెళ్లిన హనుమంతరావు.. అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
రైతు నర్సింలు కుటుంబానికి వీహెచ్ ఆర్థిక సహాయం
సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కరవైతే రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వీహెచ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఎస్సీ, ఎస్టీల భూముల జోలికి వెళ్లడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలు ఓటు విలువ తెలుసుకున్న రోజునే బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు.