సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరయ్యారు. కాసేపు ఎమ్మెల్యే బౌలింగ్ వేయగా, మంత్రి హరీశ్ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను, యువకులను అలరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేసిన 67 కిలోల కేక్‌ను హరీశ్‌రావు కట్ చేశారు.
సీఎం జన్మదిన వేడుకల్లో హరీశ్ బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్ - హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు, మంత్రి హరీశ్ రావు
టోర్నమెంట్ ఫైనల్లో గెలుపొందిన అక్కన్నపేట మండలం కుందన్వాన్ పల్లి జట్టుకు రూ. లక్షా 20 వేలు, రన్నరప్ కోహెడ జట్టుకు రూ. 60వేల చెక్కులను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.