అరుదైన బ్లాక్‌పాంథర్ (Black Panther)ను అటవీ శాఖ అధికారులు సిద్దిపేట జిల్లాలోని అడవుల్లో గుర్తించారు. మల్లన్నసాగర్ జలాశయం సమీపంలో ఉన్న కొండపాక రిజర్వ్ ఫారెస్ట్ (Kondapaka Reserve Forest)లో... బండరాళ్ల పక్కనే నక్కిన నల్ల చిరుతను అటవీశాఖ సిబ్బంది కనుగొన్నారు.
Black Panther: కొండపాక రిజర్వ్ ఫారెస్ట్‌లో నల్లచిరుత సంచారం
కొండపాక రిజర్వ్ ఫారెస్ట్‌లో బ్లాక్‌పాంథర్ సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సెల్ఫోన్లో నల్ల చిరుత చిత్రాలను బంధించారు. అడవిలోకి సమీపంలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని.... అటవీలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు సూచించారు.
నల్లచిరుత సంచారం
దూరం నుంచే తమ చరవాణుల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రెండు చిరుతలు, వాటి పిల్లలు అడవిలో సంచరిస్తున్నాయని జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. అప్పుడప్పుడు ఇవి సరిహద్దులకు వస్తున్నాయని వెల్లడించారు. అడవికి సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొండపాక రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.
ఇదీ చూడండి:Leopard : తిరుమలలో చిరుత సంచారం... భయాందోళనలో భక్తులు
Last Updated : Jul 17, 2021, 1:19 PM IST