సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 8, 11 వార్డుల్లో ఎంపీ నిధుల నుంచి మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
భాజపా ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకొని.. ఆ దిశగా పార్టీ కార్యకర్తలందరం కృషి చేస్తున్నామని సంజయ్ పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని.. ఇప్పుడు అభివృద్ధే ఎజెండాగా ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో పని చేయాలన్నారు.