సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి భాజపా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరయ్యారు. పార్టీలో చేరిన యువకులను కండువా కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే... 30 రోజుల ప్రణాళిక ప్రజల్లోకి తీసుకొచ్చినట్లు ఆయన విమర్శించారు. మజ్లిస్‌తో రహస్య ఒప్పందం చేసుకొని సెప్టెంబర్ 17ను కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. తెరాస తనపై దృష్టి పెట్టడం కాదు... ప్రభుత్వంపై నేనే దృష్టి పెడతానని హెచ్చరించారు.
ప్రజాదరణ చూసి భయపడే నలుగురు మంత్రులు: బండి - bandi sanjay
తనకు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి జిల్లా నలుగురు మంత్రులను నియమించుకున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
హుస్నాబాద్ నియోజకవర్గ సమావేశం