సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని భాజపా నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. అక్కన్నపేట జిల్లాలోనే పెద్ద మండలమని.. మండల పరిధిలో 35 గిరిజన తండాలు ఉన్నాయని.. సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైద్యులు లేక కరీంనగర్, వరంగల్ వెళ్లే పరిస్థితి నెలకొందని నాయకులు వాపోయారు. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడ వైద్యులను నియమించి ల్యాబ్ సౌకర్యం కల్పించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
'సరైన వైద్య సదుపాయాలు కల్పించండి' - భాజపా నాయకులు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యసదుపాయాలు లేవని భాజపా నాయకులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు.
భాజపా నాయకులు