భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర(praja sangrama yatra) 35వ రోజు హుస్నాబాద్ మండలం పొట్లపల్లి, పందిల్ల మీదుగా హుస్నాబాద్ పట్టణానికి చేరుకుంది. అంతకు ముందు పందిల్ల గ్రామంలో మహిళలు, యువకులు అధిక సంఖ్యలో బండి సంజయ్‌కి స్వాగతం పలికారు. పందిల్ల గ్రామంలో మానసిక వైకల్యంతో బాధపడుతున్న బాలుడు బాణాల ప్రభు(10)కు వైద్య ఖర్చులు భరిస్తానని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.
పందిల్ల గ్రామ శివారులోని కల్లు మండువాలో గౌడ కులస్తులతో కలిసి బండి సంజయ్ కల్లు తాగారు. గౌడ కులస్తులకు, పాదయాత్రలో పాల్గొన్న పలువురు పార్టీ కార్యకర్తలకు ఆయన కల్లు పోశారు. దగ్గరలో ఉన్న హమాలీ కూలీలతో కాసేపు ముచ్చటించారు. నేడు హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. రేపు హుస్నాబాద్ పట్టణంలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు రోడ్ షో సమావేశం భారీ ఎత్తున నిర్వహించడానికి భాజపా కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.