తెలంగాణ

telangana

ETV Bharat / state

'మద్యం ధరలపై నియంత్రణ పాటించట్లేదు' - సిద్దిపేట జిల్లా హుస్నాబాద్

బెల్టు షాపులు, బార్లలో మద్యం ధరలపై నియంత్రణ పాటించట్లేదని హుస్నాబాద్​ ఆబ్కారీ స్టేషన్​ ముందు అఖిలపక్షం ఆందోళన చేపట్టింది. ఇది అధికారుల నిర్లక్ష్యమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

మద్యం ధరలపై నియంత్రణ పాటించట్లేదు

By

Published : Aug 24, 2019, 11:10 PM IST

'మద్యం ధరలపై నియంత్రణ పాటించట్లేదు'
మద్యం ధరలపై నియంత్రణ పాటించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆబ్కారీ స్టేషన్ ముందు అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. పట్టణంలో బెల్టు షాపులు, బార్​లలో ధరలపై నియంత్రణ లేదని.. కల్తీ అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. హుస్నాబాద్​ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువ అమ్మడం అధికారుల నిర్లక్ష్య ఫలితమని ధ్వజమెత్తారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని.. లేకుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్​, శివసేన, భాజపా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details