సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మోటర్ వాహనాల చట్టం అమలులో భాగంగా ఈ-చలాన్ విధానాన్ని ఏసీపీ మహేందర్ ప్రారంభించారు. అక్కన్నపేట చౌరస్తాలో ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వాహనదారులకు, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. వాహన రిజిస్ట్రేషన్‌లో ఉన్న అడ్రస్‌కు పోస్టు ద్వారా ఈ-చలాన్ చేరుతుందని... అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఏసీపీ తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు ఈ-చలాన్ విధించారు. ఏసీపీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన వారికి అపరాధ రుసుము విధించారు
ఈ చలాన్ విధిస్తున్న ఏసీపీ