సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్య పరిష్కారంపై పోచమ్మ కాళ్లరిగేలా తిరిగింది. ఓపిక నశించి వీఆర్వో గల్లా పట్టుకుని కార్యాలయం బయటకు లాక్కొచ్చి మరీ నిలదీసింది. కాలర్ పట్టుకున్న పోచమ్మను వీఆర్వో తోసేయడంతో కిందపడి స్పృహ కోల్పొయింది. తక్షణం స్పందించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోచమ్మ గల్లా పట్టుకోగా... విడిపించుకొనే ప్రయత్నంలోనే ఆమె కిందపడిపోయారని, కావాలని తోసేయలేదని వీఆర్వో వివరణ ఇచ్చారు. కొన్నేళ్లుగా భూ పట్టా కోసం వీఆర్వో చుట్టూ తిరిగానని, అడిగినంత డబ్బిచ్చినా... పని చేయకుండా తిప్పుతున్నారని బాధిత మహిళ వాపోయింది.
వీఆర్ఓ గల్లా పట్టుకుని నీలదీసిన మహిళ - woman-holding-the-vro-coller-for-land-issue
తన భూ సమస్య పరిష్కరించాలని కాళ్లు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగింది. అధికారుల తీరుతో విసిగిపోయిన మహిళ..వీఆర్వో గల్లా పట్టుకుని నిలదీసింది. రెచ్చిపోయిన ఆ వీఆర్వో ఆమెను తోసివేయడంతో స్పృహ కోల్పోయింది.
వీఆర్ఓ గల్లా పట్టుకుని నీలదీసిన మహిళ
Last Updated : Aug 30, 2019, 12:54 PM IST