సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 4.17 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల్లో ప్రాదేశిక ఎన్నికల మాదిరిగానే తెరాస విజయఢంకా మోగిస్తుందని జోస్యం చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని తెలిపారు. అలాంటి గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.
'మున్సిపాలిటీల్లో విజయం మాదే'
త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం తమదేనని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే