సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు. కల్హేర్ మండలంలోని పొమ్యా నాయక్ తండా శివారులో పిడుగు పాటు వల్ల పదోతరగతి విద్యార్థి సుదర్శన్ ప్రాణాలు కోల్పోయాడు. తండాకు చెందిన లచ్చు నాయక్ కుమారుడు సుదర్శన్ పదో తరగతి చదువుతున్నాడు. లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు తండ్రికి తోడుగా పొలం పనులకు వెళ్లేవాడు. ఎప్పటి లాగానే పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోందని సుదర్శన్ ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడడం వల్ల సుదర్శన్ మృతి చెందాడు.
పిడుగు పడి ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. మండలంలోని పొమ్యానాయక్ తండాకు చెందిన సుదర్శన్ అనే పదోతరగతి విద్యార్థి చనిపోగా... అదే మండలంలోని నాగధర్ మెుదళ్ల కుంటకు చెందిన రవీందర్ అనే రైతు చనిపోయాడు.
పిడుగు పడి ఇద్దరు మృతి
మరో ఘటనలో అదే మండలం నాగధర్ మొదళ్ల కుంటకు చెందిన రవీందర్ అనే రైతు పొలంలో పనిచేసుకుంటుంగా పిడుగు పడి చనిపోయాడు.
ఇవీ చూడండి: భార్య ఇంటికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం