పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సర్కార్ దవాఖానాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోంది ప్రభుత్వం. వివిధ రకాల వసతులు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నా... సంగారెడ్డి ఆసుపత్రిలో మాత్రం క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం ప్రసవం కోసం వచ్చిన వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు.
బెడ్‌షీట్ మార్చాలంటే రూ.200
వీల్‌చైర్ తీసుకురావడానికో రేటు.. బెడ్ షీట్లు మార్చడానికో రేటు.. పుట్టిన బిడ్డను అప్పగించడానికో రేటు ఇలా అన్నింటికి చేయిచాస్తున్నారు. ఎందుకివ్వాలని ప్రశ్నిస్తున్న వారిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రసీదుకు రూ.250
ప్రసవం తర్వాత బిడ్డ వివరాలతో రసీదు ఇస్తారు. కేసీఆర్ కిట్, జనన ధ్రువీకరణ పత్రం పొందడానికి ఈ రసీదే కీలకం. ఇది కావాలంటే 250 రూపాయిలు ఇచ్చుకోవాల్సిందే.
పేరుకు ఉచితవైద్యం.. లంచాలే రూ.10వేలు..!
ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే లోపు కనీసం 5 నుంచి 10 వేల వరకు ఖర్చవుతుందని బాధితులు వాపోతున్నారు.
ఆస్పత్రులో ఈ అక్రమ వసూళ్లు నిజమేనని అంగీకరిస్తున్నారు ఆస్పత్రి పర్యవేక్షకుడు డా. సంగారెడ్డి. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అధికారులు వెంటనే సిబ్బంది అవినీతికి అడ్డుకట్ట వేస్తే సరి. లేకుంటే సర్కార్ దవాఖానాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నీరుగారటం ఖాయం.
ఇవీ చూడండి:వివేకానందరెడ్డి మృతిపై అనుమానం