తెలంగాణ

telangana

ETV Bharat / state

100 కుటుంబాలకు సాయం చేసిన మాజీ కౌన్సిలర్ దంపతులు - సంగారెడ్డి జిల్లా ఈరోజు వార్తలు

లాక్​డౌన్​తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కూలీలు, కార్మిక కుటుంబాలకు దాతలు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. జహీరాబాద్ పట్టణం బాబుమోహన్ కాలనీలో మాజీ కౌన్సిలర్ నామా రవికిరణ్ దంపతులు దాదాపు 100 కుటుంబాలకు నిత్యావసరాలు వితరణ చేశారు.

the couple helped 100 families in zahirabad
100 కుటుంబాలకు సాయం చేసిన మాజీ కౌన్సిలర్ దంపతులు

By

Published : Apr 20, 2020, 5:23 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం బాబుమోహన్ కాలనీలో మాజీ కౌన్సిలర్ నామా రవికిరణ్ దంపతులు సుమారు 100 నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. 15 రోజులకు సరిపడ బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు.

లాక్​డౌన్ పొడిగింపు చేసిన సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కార్మికుల కుటుంబాలకు చేయూత అందించేందుకు మరింత మంది ముందుకు రావాలని సూచించారు.

ఇదీ చూడండి :కానిస్టేబుల్ భార్యను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details