అప్పటికే జహీరాబాద్ బస్టాండ్లో అధికారులు వేచి చూసి తనిఖీలు చేయగా చివరి రోజు చేతివాటం గుట్టురట్టయింది. డ్యూటీలో భాగంగా ప్రయాణికులకు టికెట్ ఇచ్చి వసూలు చేసిన తొమ్మిది వేల పైచిలుకు డబ్బుల నుంచి మరో 1300 చూపకుండా కొట్టేసే ప్రయత్నం చేశాడని అధికారులు గుర్తించారు. తాత్కాలిక కండక్టర్లను డీఎం రమేశ్ వద్దకు తీసుకెళ్లి తక్కువ చూపిన డబ్బులతో పాటు ఎనిమిది మంది నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులను కట్టించి మందలించి పంపించారు.
అడ్డంగా దొరికిన తాత్కాలిక కండక్టర్ - సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్లో తాత్కాలిక కండక్టర్ చివరి రోజే కదా అని చేతివాటం ప్రదర్శించాడు. తనిఖీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 1,300 కొట్టేసేందుకు యత్నించాడు.
అడ్డంగా దొరికిన తాత్కాలిక కండక్టర్