కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పట్టణంలోని కైలాసగిరి శివాలయం, సిద్దేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయం, షిరిడీ సాయిబాబా మందిరం, దత్తగిరి ఆశ్రమానికి తరలివచ్చారు. కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసగిరి శివాలయంలో ప్రత్యేక హోమం చేశారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
భక్తులతో కోలాహలంగా మారిన దేవాలయాలు - సంగారెడ్డి జిల్లా
కార్తిక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఆలయాలన్నీ భక్తులతో కోలాహలంగా మారాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.
భక్తులతో కోలాహలంగా మారిన దేవాలయాలు