సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బకాయిలు చెల్లించాలని చెరకు రైతులు నిరసన చేపట్టారు. మధునగర్లో కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించగా పాల్గొన్న ట్రైడెంట్ చక్కెర కర్మాగారం యజమానిని చెరుకు రైతులు నిలదీశారు. అనంతరం కారును అడ్డుకున్నారు. గానుగకు చెరకు తరలించి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగారంలో దశాబ్దాలుగా సహాయ మేనేజర్ ఇతర అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోమ, మంగళవారాల్లో సమావేశం నిర్వహించి బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇందుకు అంగీకరించిన రైతులు ఆందోళన విరమించారు.
చక్కెర కర్మాగార యాజమానిని అడ్డుకున్న రైతులు
తమకు రావాల్సిన బకాయిల కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చెరకు రైతులు ఆందోళన చేపట్టారు. యజమానిని అడ్డుకున్నారు. వచ్చే రెండు రోజుల్లో పెండింగ్ నిధులు చెల్లిస్తామని యాజమాన్యం హామీతో ఆందోళన విరమించారు.
formers