తెలంగాణ

telangana

ETV Bharat / state

సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అదృశ్యం.. ఆ తరువాత ఏమయ్యాడు?

ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది. ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకపోవడం వల్ల పటాన్​చెరు పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

software employee missing at patancheru in sangareddy district
పటాన్​చెరులో ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అదృశ్యం

By

Published : Jul 15, 2020, 10:03 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యం కావడం వల్ల అతని సోదరుడు పటాన్​చెరు పీఎస్​లో ఫిర్యాదు చేశాడు.పటాన్​చెరు మండల కేంద్రంలోని ఇంద్రేశం కాలనీకి చెందిన మధుసూదన్ అనే సాఫ్ట్​వేర్ ఉద్యోగి అమీర్​పేట్​లో ఏదో పని ఉందని ఈనెల 12వ తేదీన ఇంటి నుంచి బయల్దేరాడు. అతని సోదరుడు భాస్కర్ పటాన్​చెరు బస్టాండ్ లో అతనిని వదిలి పెట్టాడు. మధ్యాహ్నం భార్య సంధ్యారాణి ఫోన్ చేసేసరికి మళ్లీ చేస్తానని మధుసూదన్ ఫోన్ పెట్టేశాడు.

అనంతరం ఫోన్ చేసినా.. అతని రెండు నెంబర్లు స్విచ్ఛాఫ్​ చేసి ఉన్నాయి. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అతని సోదరుడు భాస్కర్ బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం పటాన్​చెరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇవీ చూడండి: ఘరానా మోసం.. రైతుల నుంచి రూ.2 లక్షలు స్వాహా

ABOUT THE AUTHOR

...view details