సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో భూమిపుత్ర ఇంటర్నేషనల్ వైశ్యా ఫెడరేషన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య దంపతులతో కలిసి జిల్లా పాలనాధికారి హనుమంతరావు ప్రారంభించారు. జిల్లాలో అటవీ శాతం 5 నుంచి 6 శాతం మాత్రమే ఉందని.. దాన్ని 35 శాతానికి పెంచాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, పార్కుల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలను పెంచాలని తెలిపారు.
పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో వృక్ష సంపదను పెంచాలి: కలెక్టర్ హనుమంతరావు - పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో వృక్ష సంపదను పెంచాలి: కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక కాలుష్యం ప్రాంతంలో వృక్ష సంపదను పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా పాలనాధికారి హనుమంతరావు అన్నారు. జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో వృక్ష సంపదను పెంచాలి: కలెక్టర్ హనుమంతరావు
మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మూడు లక్షల విత్తన బంతులను జిల్లా అధికారులు చేయించారు. ఝరాసంగం, నారాయణఖేడ్ వంటి ప్రాంతాల్లో వీటిని చల్లే విధంగా చూస్తున్నాం. 4000 మొక్కలతో మినీ ఫారెస్ట్‌లను పెంచాలని పాలనాధికారి సూచించారు.
ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్
TAGGED:
Seedballs