తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రులు వస్తున్నారని సర్పంచుల ధర్నా... - SARPANCH PROTEST IN SANGAREDDY

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, ఇంద్రకర్​రెడ్డి సమావేశానికి వస్తున్నారన్న సమాచారంతో జిల్లాకు చెందిన సర్పంచులు నిరసనకు దిగారు. ఉపసర్పంచులకు చెక్​పవర్​ తీసేయ్యాలని డిమాండ్​ చేశారు.

SARPANCH PROTEST IN SANGAREDDY

By

Published : Jul 27, 2019, 3:59 PM IST

సంగారెడ్డిని ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించాలని సర్పంచులు ధర్నా నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్​రెడ్డి సమావేశానికి హాజరవుతున్నారన్న సమాచారంతో సభావేదిక ఆవరణలో ఆందోళనకు దిగారు. ఉపసర్పంచుల చెక్​పవర్​ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని వల్ల గ్రామాభివృద్ధి, పాలనలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని సర్పంచ్​లు డిమాండ్ చేశారు.

మంత్రులు వస్తున్నారని సర్పంచుల ధర్నా...

ABOUT THE AUTHOR

...view details