లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో తన తనయుడు జయంత్ రెడ్డి, అతని స్నేహితులు నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని సంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డి పేట గ్రామంలో 300 మంది నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పేదలకు సరకులు పంపిణీ చేసిన జడ్పీ ఛైర్ పర్సన్ - Lockdown
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డి పేట గ్రామంలో 300 మంది నిరుపేదలకు సంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
Groceries distribution in sangat Eddy district
ఆమె తనయుడు జయంత్ రెడ్డితో కలిసి సరకులను పేదలకు అందించారు. కరోనా మహమ్మారి నుంచి మనకు మనం రక్షించుకోవాలంటే స్వీయ నియంత్రణ పాటించాలని ఆమె ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సతీష్ కుమార్, ఎంపీటీసీ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.