అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంగారెడ్డి నియోజకవర్గంలో విరాళాలు సేకరిస్తున్నారు. కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామస్థులు.. శ్రీరామ ఉత్సవ మూర్తులతో ఇంటింటికి పాదయాత్ర చేసి నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఇంటింటా తిరుగుతూ.. రామ మందిరానికి నిధి సేకరణ - ayodhya
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం.. సంగారెడ్డి నియోజకవర్గంలో నిధి సేకరణ చేపట్టారు. భక్తులు స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం నుంచి పురవీధుల్లో తిరుగుతూ గ్రామస్థుల నుంచి విరాళాలను స్వీకరించారు.
ఇంటింటా తిరుగుతూ.. రామ మందిరానికి నిధి సేకరణ
భక్తులు స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం నుంచి ర్యాలీతో మొదలై.. పురవీధుల్లో తిరుగుతూ గ్రామస్థుల నుంచి విరాళాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మందిర నిర్మాణానికి కృషి చేయడం సంతోషంగా ఉందంటూనే.. నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:'మన్ కీ బాత్'పై రాహుల్ పరోక్ష విమర్శలు