తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె ప్రగతికి పాటుపడ్డారు... ట్రాక్టర్లు సంపాదించారు - 30 days pagathi pranalika

పల్లె ప్రగతి పేరిట గ్రామాలను పరిశుభ్రంగా మార్చేలా అధికారులు, ప్రజలు కలిసి కదిలారు. చెత్త సేకరణ... హరితహారం మొక్కల సంరక్షణ... ముళ్లపొదల తొలగింపు... వంటి పనులకు శ్రీకారం చుట్టారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేశారు. ప్రతిగ్రామానికి ఓ ట్రాక్టర్ ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

sangareddy district Tractor Distributed today news

By

Published : Oct 25, 2019, 4:33 PM IST

పల్లె ప్రగతికి పాటుపడ్డారు...ట్రాక్టర్లు సంపాదించారు

పల్లెలను పరిశుభ్రంగా మార్చేందుకు సర్కారు 30రోజుల ప్రణాళికను రూపొందించింది. ప్రజలు అధికారులు సమష్టిగా కృషి చేసి.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రమదానంతో పల్లెల రూపురేఖలు మార్చేశారు. హరితహారంతోపాటు డంప్ యార్డ్, వైకుంఠధామాలు ఏర్పాటు చేసుకున్నారు.

మంత్రి హరీశ్​రావు సూచనతో....

ఆర్థిక మంత్రి హరీశ్​ రావు సూచనతో అధికారులు ట్రాక్టర్ల పంపిణీకి ప్రణాళిక రూపొందించారు. 2000లకు పైగా జనాభా ఉన్న గ్రామాలకు 42 హెచ్​పీ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్, 2000 కంటే తక్కువ జనాభ ఉన్న పంచాయతీలకు 24 హెచ్​పీ ట్రాక్టర్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. చెత్తను తరలించేందుకు ట్రాలీ, మొక్కలకు నీళ్లు పోయడానికి ట్యాంకర్, గ్రామంలో స్వచ్ఛభారత్ నిర్వహించేందుకు డోజర్ కూడా ఇంజన్​తోపాటు అందివ్వనున్నారు. సంగారెడ్డి జిల్లాలో మహీంద్రా ట్రాక్టర్ తయారీ పరిశ్రమ ఉండటం వల్ల కలెక్టర్ హన్మంతరావు చొరవ తీసుకుని.. యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. తక్కువ ధరకే ట్రాక్టర్లు అందించేలా వారిని ఒప్పించారు.

డీసీసీబీ రూ.50 కోట్ల రుణం...

42హెచ్​పీ ఇంజన్‌, ట్రాలీ, ట్యాంకర్​, డోజరు కలిపి రూ.9లక్షల వ్యయం అవుతోంది. ఇందులో సగం గ్రామ పంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తుండగా.. మిగిలిన సొమ్ము డీసీసీబీ బ్యాంకు నుంచి రుణం అందించనున్నారు. ట్రాక్టర్ల కొనుగోలు కోసం డీసీసీబీ సుమారు 50కోట్ల రూపాయలకు పైగా గ్రామపంచాయతీలకు రుణం రూపంలో అందిస్తోంది. ఈరోజు ఆర్థిక మంత్రి హరీష్ రావు.. ట్రాక్టర్లను ఆయా గ్రామ పంచాయతీలకు అందివ్వనున్నారు. వివిధ పనులకు ఉపయోగపడేలా.. ఈ యంత్ర పరికరాలు అందివ్వడం ద్వారా గ్రామ పంచాయతీలపై ఆర్థికభారం తగ్గనుంది.

సంగారెడ్డి జిల్లా స్ఫూర్తితో.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచయతీకి ట్రాక్టర్లు అందివ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన చేశారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతన్న కష్టాలు

ABOUT THE AUTHOR

...view details