సంగారెడ్డి జిల్లా హత్నూర్ పీహెచ్‌సీలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పురుషోత్తం ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా ఉపవైద్యాధికారి నాగలక్ష్మి హత్నూర పీహెచ్‌సీకి వెళ్లి విచారణ చేశారు. ఏఎన్‌ఎంలను, ఆశా కార్యకర్తలను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు.
హుత్నూర్ పీహెచ్‌సీలోని ఆరోపణలపై జిల్లా ఉపవైద్యాధికారి విచారణ
తమతో పనిచేసే ఓ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంగారెడ్డి జిల్లా హుత్నూర్ పీహెచ్‌సీని జిల్లా ఉపవైద్యాధికారి నాగలక్ష్మి విచారణ చేపట్టారు. విచారణ పూర్తైయ్యాక సేకరించిన నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు ఇవ్వడం జరుగుతుందని తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
హుత్నూర్ పీహెచ్‌సీలోని ఆరోపణలపై జిల్లా ఉపవైద్యాధికారి విచారణ
ఇక్కడ సేకరించిన నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు ఇవ్వడం జరుగుతుందని ఆమె చెప్పారు. తదుపరి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోని పక్షంలో తమను ఇతర ప్రాంతాలకు బదిలి చేయమని కోరతామని ఏఎన్‌ఎంలు తెలిపారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు
TAGGED:
సంగారెడ్డి జిల్లా తాజా వార్త