తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తే సహించబోం: జిల్లా కలెక్టర్​ - sangareddy district news

డంప్​ యార్డు, వైకుంఠధామాల నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తే సహించబోమని అధికారులను సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హెచ్చరించారు. నారాయణఖేడ్​ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణాలు నిర్ధేశిత సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

sangareddy district collector inspected development works in villages
నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తే సహించబోం: జిల్లా కలెక్టర్​

By

Published : Jul 19, 2020, 5:21 PM IST

డంప్​ యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలు నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, సర్పంచ్​లపై చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలంలోని అబెండా, హాంగర్గ, చప్టా, అంత్వార్, ఆనంతసాగర్, తదితర గ్రామ పంచాయతీలను స్థానిక అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. అక్కడ డంప్ యార్డ్, వైకుంఠధామాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు.

పనులు నత్తనడకన ఎందుకు నడుస్తున్నాయని అన్నారు. ఇక పై జాప్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఆయా మండలాల్లో మండల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిరోజూ పనుల పురోగతి మెరుగుపడేలా చూడాలని తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి పనులను పరిశీలించారు. ఆయన వెంట నారాయణ ఖేడ్ ఆర్డీవో రాజేశ్వర్ ఉన్నారు.

ఇవీ చూడండి:'మీ రాజకీయం కోసం సంగారెడ్డి ప్రజలను చంపేస్తారా'

ABOUT THE AUTHOR

...view details