సంగారెడ్డిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన - sangareddy collector sudden visit to colonies in town
సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. పలు కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల అసహనం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పట్టణంలో ఎక్కడ చెత్తా, చెదారం, మురుగునీరు ఉండొద్దని సూచించారు.
సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. పట్టణంలోని పలు కాలనీలు తిరిగిన ఆయన.. పారిశుద్ధ్య నిర్వహణ పట్ల మున్సిపాలిటీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పట్టణంలో ఎక్కడ చెత్తా, చెదారం, మురుగునీరు లేకుండా బాగు చేయాలని సూచించారు. అదే విధంగా కాలనీ వాసులకు రోడ్లపై చెత్త వేయొద్దని.. వేస్తే కలిగే అనర్థాలను గురించి వివరించారు. కొత్త ఇళ్లు కట్టుకునే వాళ్లు... సామగ్రిని రోడ్డుపై వేయొద్దని.. అలా వేసిన వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
TAGGED:
కలెక్టర్ పర్యటన