అందోల్ జోగిపేట పురపాలక పరిధిలోని ఆయా వార్డుల్లో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో అధికారుల తీరుపై జిల్లా పాలనాధికారి హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట పురపాలక కార్యాలయంలో పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్తో కలిసి పురపాలక శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పురపాలక అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్య, మురుగు కాలువల వ్యవస్థ, భవన నిర్మాణ అనుమతులు, తదితర అంశాలపై చర్చించారు.
పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ అసంతృప్తి - SANGAREDDY COLLECTOR
సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట పురపాలక కార్యాలయంలో అధికారులతో జిల్లా పాలనాధికారి హనుమంతరావు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పాల్గొన్నారు. ఆయా వార్డుల్లో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్య పనులపై చర్చించారు.
పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్