నామినేషన్ల వివరాలు...
"పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం" - district sp
పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఎస్పీతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 28న ఉపసంహరణ గడువు తేదిలు ఖరారైనట్లు తెలిపారు. ఏప్రిల్ 11న జిల్లా వ్యాప్తంగా 1557కేంద్రాలలో పోలింగ్ నిర్వహించేందుకు సన్నద్ధం అయినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖ సమన్వయంతో కలిసి పనిచేస్తామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి:అఖిలపక్షం నేతలతో ఎస్ఈసీ సమావేశం