సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం లక్డారం కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. 108 అందుబాటులో లేకపోవడం వల్ల క్షతగాత్రులను డీసీఎంలో ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన వీరు హైదరాబాద్కు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. వెనుక నుంచి లారీ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఓ అపరిచిత వ్యక్తి ఈ ఘటనని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయగా వైరల్గా మారింది.
లక్డారం కూడలి వద్ద రోడ్డుప్రమాదం - lorry
సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగా గాయలవగా వారిని ఆసుపత్రికి తరలించారు.
లక్డారం కూడలి వద్ద రోడ్డుప్రమాదం