కరోనా ప్రబలుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కచ్చితంగా పాటించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సూచించారు. కరోనా పట్ల అవగాహన కలిగి ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని జడ్పీ ఛైర్ పర్సన్ మంజు శ్రీ, ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ పట్టణంలో పర్యటిస్తూ ప్రజలుకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పట్టణవాసులంతా ఇంటిపట్టునే ఉండాలని.. అత్యవసరమైతేనే రోడ్ల మీదికి రావాలని ఎమ్మెల్యే సూచించారు.
'సామాజిక దూరమే కరోనా నివారణకు సరైన మందు' - zp, mla awareness on corona at zaheerabad
జహీరాబాద్ పట్టణం ప్రధాన రహదారులపై జడ్పీ ఛైర్ పర్సన్ మంజు శ్రీ, ఎమ్మెల్యే మాణిక్ రావు పర్యటిస్తూ... కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పట్టణ వాసులకు వివరించారు.
సామాజిక దూరమే కరోనా నివారణకు సరైన మందు
నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారు షాపుల దగ్గర సామాజిక దూరం పాటించాలన్నారు. అవసరం లేకున్నా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులను అడ్డుకుని బయటకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.
TAGGED:
జహీరాబాద్