ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి గిరిజన బాలుర వసతిగృహం వరకు ప్రదర్శన చేపట్టారు. జై బంజారా.. జై జై బంజారా అంటూ నినాదాలు చేశారు. గిరిజన పంచాయతీలకు ప్రత్యేక నిధులు.. తండాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం వసతిగృహంలో విద్యార్థులతో కలిసి సంబురాలు నిర్వహించారు.
గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ - సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. .. తండాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.
గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
ఇవీ చూడండి: వర్షాభావానికి ప్రత్యామ్నాయం 'ఆరుతడి'