పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని విభజించి ఒక వర్గం వారి ఓట్లు దక్కించుకోవడానికి మరో వర్గాన్ని కించపరుస్తూ భాజపా వ్యాఖలు చేయడాన్ని ఖండించారు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్.
'ఒక వర్గం ఓట్ల కోసం మరో వర్గాన్ని కించపరచడం సరికాదు' - సంగారెడ్డి తాజా వార్త
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
'ఒక వర్గం ఓట్ల కోసం మరో వర్గాన్ని కించపరచడం సరికాదు'
గతంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మళ్లీ అదే విధంగా పేద ప్రజలు అవస్తలపాలుకావడం తప్పదని అన్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా భాజపా వ్యవరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చేసిన ఈ చట్టాన్ని రద్దుచేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంఛార్జీ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'తిరంగ' ర్యాలీకి పోలీసుల నిరాకరణ.. చేస్తామంటున్న కాంగ్రెస్