సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పెరిగిన ఆసరా పింఛన్లను ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ మంజుశ్రీతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అర్హులకు అందించారు. నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు పడక గదులు కేటాయించేలా చూస్తామని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అభివృద్ధిలో అందరిని భాగస్వామ్యం చేస్తామని వివరించారు. తెరాస ప్రభుత్వంతోనే అభివృద్ధి వేగవంతమవుతుందని ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి చెప్పారు.
పటాన్చెరులో పెంచిన ఆసరా పింఛన్ల పంపిణి - pampini
పటాన్చెరు నియోజకవర్గంలో పెరిగిన పింఛన్లను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అర్హులకు అందించారు. రాబోయే నాలుగు మున్సిపాలిటీలలో ఛైర్మన్, కౌన్సిలర్లను గెలిపించాలని అభ్యర్థించారు.
పటాన్చెరులో పెంచిన ఆసరా పింఛన్ల పంపిణి