Patancheru CI Suspension : సంగారెడ్డి జిల్లా బీరంగూడ మల్లారెడ్డి కాలనీకి చెందిన నాగేశ్వరావు డిసెంబర్ 21న ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఫోన్ చేస్తే, మహారాష్ట్రలో ఉన్నట్టు తెలియడంతో అతని భార్య పద్మ అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైన నాగేశ్వరరావు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోహత్యకు గుర్యయాడు. ఈ నేపథ్యంలో కేసువిచారణలో నిర్లక్ష్యం వహించిన పటాన్‌చెరు సీఐ లాలూనాయక్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
CI Lalu Naik Suspended in Missing Man Murder Case :అయితే ఈ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు నాగేశ్వర్‌రావుకు లారీ ఉండటంతో ఇసుక వ్యాపారం చేసేవాడు. అతని లారీపై నారాయణఖేడ్‌కు చెందిన రాములు అనే డ్రైవర్ ఇదివరకు పనిచేసేవాడు. తరుచూ అతను డీజిల్ అమ్ముకోవడంతో మందలించిన నాగేశ్వరరావు, తోటి లారీ యజమానులతో గట్టిగా చెప్పించాడు. దాంతో డ్రైవర్ రాములు, నాగేశ్వరరావు వద్ద పని మానేశాడు.
ప్రాణం తీసిన ప్రేమ - మామాఅల్లుడిపై దాడి ఘటన, తండ్రి, కుమారుడి అరెస్టు
Man Missing Murder Case Patancheru : ఆ తర్వాత కొద్దిరోజులకు శంకర్ అనే వ్యక్తి, తాను డ్రైవర్‌గా పనిచేస్తానని రావడంతో, నాగేశ్వర్‌రవు ఒప్పుకుని పనిలో పెట్టుకున్నాడు. అయితే అతడ్ని రాములే పంపించి పన్నాగం ప్రకారం హత్యచేయించాడని మృతుని భార్య, కుమార్తె ఆరోపిస్తున్నారు. ఆ మేరకు విచారణ ముమ్మరం చేసిన పోలీసులు, ఈ హత్య కేసులో డ్రైవర్‌గా చేరిన శంకర్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నాగేశ్వరరావుని కొట్టిపడేశానని చనిపోయాడనుకుని అతని ఫోన్ తీసుకుని వెళ్లిపోయానని శంకర్ నిజం చెప్పాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.