తెలంగాణ

telangana

62 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

By

Published : Dec 30, 2019, 6:35 AM IST

Updated : Dec 30, 2019, 8:39 AM IST

ఇంట్లో ఆశ్రయం ఇస్తానని తీసుకెళ్లి 62 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన హైదరాబాద్​ నగర శివారులోని వెలిమెల గ్రామంలో చోటు చేసుకుంది.

old women raped in sangareddy district
62 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

ఇంట్లో ఆశ్రయం ఇస్తానని తీసుకెళ్లి వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టడంతో బాధితురాలు... పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. వనపర్తికి చెందిన ఓ కుటుంబం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామానికి బతుకుదెరువు నిమిత్తం వచ్చింది. అక్కడే ఓ ఇల్లును అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబంలో 62 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉంది. ఆ వృద్ధురాలిని ఇంటివద్ద ఉంచి కుటుంబసభ్యులు పనులకు వెళ్లేవారు.

అందరూ పనులకు వెళ్లగా... ఇంటికి సమీపంలో ఉన్న కొండయ్య అనే వ్యక్తి ఆ వృద్ధురాలిని తన ఇంటికి పిలిచి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై బీడీఎల్ భానూరు పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

62 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

ఇవీ చూడండి: పెళ్లికి వెళ్లి వచ్చేసరికే ఇంటిని దోచేశారు!

Last Updated : Dec 30, 2019, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details