సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని న్యాయస్థానంలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ నీరజ, జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ శ్రీదేవి పాల్గొని కేసులను పరిష్కరించారు. కక్షిదారులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోకుండా పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. కక్షిదారులు భారీగా తరలివచ్చి కేసుల్లో రాజీ పడ్డారు. భూ, సివిల్ తగాదాలు, ఎక్సైజ్ కేసులను పరిష్కరించి... అవసరమైన వారికి జరిమానా విధించారు.
జహీరాబాద్ న్యాయస్థానంలో జాతీయ లోక్అదాలత్
కక్షిదారులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవాలని సంగారెడ్డి జిల్లా న్యాయమూర్తులు సూచించారు. జిల్లా న్యాయస్థానంలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు.
లోక్అదాలత్