సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మించిన డంప్ యార్డులను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి వాటి నిర్మాణాలను పరిశీలించారు.
'డంపింగ్ యార్డుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి' - సంగారెడ్డి జిల్లా వార్తలు
డంప్ యార్డులను ప్రజలందరూ వినియోగించుకునే విధంగా పంచాయతీ పాలకులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన డంప్ యార్డులను ప్రారంభించారు.
డంప్ యార్డులను ప్రారంభించిన ఎమ్మెల్యే
డంప్ యార్డులను స్థానికులు వినియోగించే విధంగా పంచాయతీ పాలకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయనతో పాటుగా మండల ప్రజాప్రతినిధులు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నిమ్స్‌లో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్... ఒక్కొక్కరికి మూడు డోసులు