సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో ఎంపీపీ ప్రియాంక రెడ్డి అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి గ్రామాల్లో... తాగునీటి ఎద్దడి మొదలైందని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకొని అన్ని గ్రామాల్లో ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. అవసరమైన గ్రామాల్లో ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ వివిధ విభాగాల్లోని వివిధ శాఖల్లో ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేసేందుకు సభలో తీర్మానించారు.
'ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వాలి'
ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వి... భూగర్భజలాలను పెంపొందించేందుకు తమ వంతు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా మొగుడం పల్లి ఎంపీపీ ప్రియాంకరెడ్డి తెలిపారు. గ్రామాల్లో నీటి ఎద్దడిని తీర్చేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
MPP PRIYANKA REDDY REVIEW MEETING ON WATER PROBLEMS