ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. పట్టణంలో రూ.20 లక్షలతో రూపొందించిన ఓపెన్ జిమ్, రూ.22 లక్షలతో ఆధునీకరించిన ఉద్యానవనాన్ని ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్తో కలిసి ప్రారంభించారు. జిమ్లో కసరత్తులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం పార్క్లో కలియ తిరిగిన మాణిక్రావు పనుల నాణ్యత పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గుత్తేదారులను సున్నితంగా మందలించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను స్థానిక నేతలు సత్కరించారు.
ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ కసరత్తులు - gym
జహీరాబాద్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాణిక్రావు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే స్పష్టంచేశారు.
mla-mlc-doing-exercises-in-open-gym-in-jaheerabad