సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆందోళనకు దిగారు. 65 నెంబర్ జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలసి బైఠాయించారు. ఉత్తర్ప్రదేశ్లో రాహుల్ గాంధీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. భాజపా ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జాతీయ రహదారిపై కాంగ్రెస్ ఆందోళన
ఉత్తర్ప్రదేశ్లో రాహుల్ గాంధీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆందోళనకు దిగారు. 65 నెంబర్ జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలసి బైఠాయించారు.
జాతీయ రహదారిపై కాంగ్రెస్ ఆందోళన
రాహుల్ గాంధీపై అనుచితంగా వ్యవరిస్తే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగుతాయని జగ్గారెడ్డి హెచ్చరించారు. జగ్గారెడ్డి, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.