ఆర్థిక స్థోమత లేక అనారోగ్యంతో బాధపడేవారికి ఆస్పత్రి ఖర్ఛులు పూర్తిగా తానే భరిస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. ఇది సంగారెడ్డి ప్రజలకు తన తరఫున దసరా కానుకన్నారు. ప్రజల అభివృద్ధి కోసం కాకుండా.. అధికారం కోసం ఎవరివద్దా జగ్గారెడ్డి తలవంచడన్నారు. నవంబర్ నుంచి ప్రతి సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సంగారెడ్డి పట్టణంలో విజయదశమి సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రామాలయం నుంచి సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శమీ పూజ చేశారు. పాలపిట్టను ఎగురవేసి... రావణ దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ప్రజలకు జగ్గారెడ్డి దసరా కానుక ఏంటో తెలుసా..! - sangareddy mla
ప్రజల అభివృద్ధి కోసం తప్ప అధికారం కోసం అమ్ముడుపోనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ప్రజలకు జగ్గారెడ్డి దసరా కానుక ఎంటో తెలుసా..!