తెలంగాణ

telangana

ETV Bharat / state

సరైన చర్యలు లేకే ప్రజలు కరోనాతో చనిపోతున్నారు: జగ్గారెడ్డి - ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజా వార్తలు

తెలంగాణలో కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. దీనివల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప.. సంగారెడ్డి ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా సంగారెడ్డి ఆస్పత్రిని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సరైన చర్యలు లేకే ప్రజలు కరోనాతో చనిపోతున్నారు: జగ్గారెడ్డి
సరైన చర్యలు లేకే ప్రజలు కరోనాతో చనిపోతున్నారు: జగ్గారెడ్డి

By

Published : Jul 11, 2020, 7:13 AM IST

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి వర్తక సంఘం అధ్యక్షుడు సూరి సరైన వైద్యం అందకనే చనిపోయాడని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎవరూ చేర్చుకోలేదని... ప్రభుత్వ ఆస్పత్రిలో చేరేలోపు శ్వాస ఆడక చనిపోయాడని బాధపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎ వ్యాధితో కూాడా చనిపోతున్నారో చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లా హెడ్‌ క్వార్టర్​లో.. దగ్గు వచ్చి ఎవరైనా ఆస్పత్రికి వెళ్తే కరోనా అన్న అనుమానంతో చేర్చుకోవడం లేదన్నారు. ఇవి దురదృష్టకరమైన పరిస్థితులని వ్యాఖ్యానించారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప.. సంగారెడ్డి ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. జిల్లా మంత్రిగా హరీశ్‌ రావు తక్షణమే స్పందించి.. కొవిడ్‌ రోగులకు మెరుగైన వైద్యం అందేట్లు సంగారెడ్డి ఆస్పత్రిని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ABOUT THE AUTHOR

...view details