సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి(డి)లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానిక్రావ్ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మొక్కలను సంరక్షించిన వారికి ప్రత్యేక బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. గ్రామ శివారులోని ఈస్టర్ గుట్టపై మొక్కలు నాటడం వల్ల ఆహ్లాదకర వాతావరణం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
'మొక్కలను సంరక్షిస్తే ప్రత్యేక బహుమతులు' - ఎమ్మెల్యే
జహీరాబాద్ మండలం రాయిపల్లి(డి)లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానిక్రావ్ పాల్గొన్నారు. నాటిన మొక్కలను సంరక్షిస్తే బహుమతులు ప్రదానం చేస్తామని ప్రకటించారు.
'మొక్కలను సంరక్షిస్తే ప్రత్యేక బహుమతులు'