కరోనా విపత్తు సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురం లబ్ధిదారులకు ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యంలో ఉన్నా.. సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని తెలిపారు.