సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నియోజకవర్గంలోని 75 మంది బ్రాహ్మణులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సహకారంతో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. లాక్డౌన్లో భాగంగా పురోహితులు ఉపాధి కోల్పోయారని ఎమ్మెల్యే తెలిపారు. వారిని ఆదుకునేందుకు కలెక్టర్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
బ్రాహ్మణులకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సహకారంతో నారాయణఖేడ్ శాసనసభ్యులు భూపాల్‌రెడ్డి 75 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
బ్రాహ్మణులకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన వారికి కూడా నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ దశరథ్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 14 వేల మంది సినీ కార్మికులకు ఆసరాగా తలసాని ట్రస్ట్