తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే - mla_visit_

సంగారెడ్డి జిల్లా మార్డి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పరిశీలించారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

mla bhupal reddy visit grain purchase center in sangareddy district
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

By

Published : May 13, 2020, 8:52 PM IST

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని మార్డి గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సందర్శించారు. అక్కడ కొనుగోలు విధానాన్ని ఆయన పరిశీలించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ రామావత్ రాంసింగ్, మండల ఎంపీపీ సుశీల, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'బయోమెట్రిక్ లేకుండానే వారికి రేషన్ ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details